పుట:Andhra-Bhashabhushanamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

v


నందే 189 పద్యమున "మానెఁడు జేనెఁడు ననుక్రియ, మానకెఁడులనొందుమీఁ దమ్రానయకేతా" అనియున్నచోట "మార్నకేతా" అని చెన్నపురి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమందున్న వ్రాఁతప్రతిలోను, "మారయకేతా" యని యాంధ్రసాహిత్యపరిషద్భాండాగారమందున్న (1859 పుస్తకసంఖ్యగల) తాళపత్రగ్రంథమునను గలదు. ఒకప్రతిలో "మ్రానయకేతా" యనుటకు "మహిలో దండీ" యని గలదు.

అవి యటుండ దశకుమారచరిత్రమందుఁ బీఠికలో 23 పద్యమున "మూలఘటికాన్వవాయ సముద్రపూర్ణ, హిమమయూఖుండు మారయకమలకమల, వదనయగు సంకమాంబకు వరతనూజుఁ, గేతనార్యుని నన్ను విఖ్యాతయశుని" అని గలదు. ఇట్లు మారయ్యయను వ్రాఁతలనుబట్టి వార ట్లభిప్రాయపడి యుందురు. కాని మ్రానయ్య యనియే యనవలయును. కేతనకవిరచించిన విజ్ఞానేశ్వరమునం దీక్రింది పద్యమున మ్రానయ యని నకారము ప్రాపస్థానమునఁ బ్రయోగింపఁబడినది. దాన మ్రానయయని ధ్రువపడినది.

క. "మ్రానయకు నంకమాంబకు
   సూనుఁడ మితసత్యహితవచోవిభుఁడను వి