పుట:Andhra-Bhashabhushanamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

ఆంధ్రభాషాభూషణము


నుత్తరపదార్థప్రధానంబును నన్యపదార్థప్రధానంబును నుభయపదార్థప్రధానంబును ననం జతుర్విధంబులై వర్తిలు నందుఁ బూర్వపదార్థ ప్రధానం బెట్టి దనిన. 110

క. పెడతలయును క్రేఁగన్నులు
   నడురే యెడకాలు మనుజనాథుఁడు రిపుఁ దా
   నెడగాలఁ బెట్టె ననఁ బొలు
   పడక నుదాహరణము లగు నభినవదండీ. 111

వ. ఉత్తరపదార్థప్రధానం బెట్టి దనిన. 112

క. చలిగాడ్పు నల్లగలువలు
   వలవంతలు తెల్లదమ్మి వలిక్రొవ్విరియె
   తైలమావిమోక జెంజిగు
   రలరమ్ములు నాఁగ నివి యుదాహరణంబుల్. 113

క. అని యగు గుణిపిఱుఁద గుణం
   బనువుగ బోధించుచోట నది గాదే న
   ట్ల నకార ముండు నల్లని
   కనుఁగవ యన నల్లగన్నుఁగవ యనఁ జనుటన్. 114

వ. అన్యపదార్థప్రధానం బెట్టి దనిన. 115

తే. చలివెలుఁగు వేఁడివెలుఁ గనఁ బులుఁగుపడగ
    నలువ యన మచ్చెకంటి నా నలరువిల్తుఁ