పుట:Andhra-Bhashabhushanamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv


క. ఖ్యాతశుభచరిత్రుఁడ వృష
    కేతనపాదద్వయీనికేతనుఁ డనఁగాఁ
    గేతన సత్కవి యనఁగా
    భూతలమున [1]నుతిశతంబుఁ బొందినవాఁడన్. 3

ఆ. కవితఁజెప్పి యుభయకవి మిత్రు మెప్పింప
    నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ
    బరఁగ దశకుమారచరితంబుఁ జెప్పిన
    ప్రోడ నన్ను వేఱె పొగడనేల?" 15

కేతనకవి మూలఘటికాన్వయుఁడు అనఁగా ఈతని యింటిపేరు మూలఘటికవారు. అహోబలపండితీయమును గాళిందీకన్యాపరిణయమును రచించిన గాలి నరసయ్య, గాలి అనుదానికి ప్రభంజనము అనియు, నరసయ్య అనుదానికి అహోబలపతి యనియు సంస్కృతీకరించి, ప్రభంజనము అహోబలపండితుఁడని పేరు పెట్టుకొనియుండెను. అట్లే మూలఘటికానామమునకు మొదటి తెలుఁగుపద మేదో యుండియుండును. లేక వీరఘంటలవారివలె మూలఘంటలవా రుండిరో. ఈతనితండ్రి పేరు మ్రానయ్య తల్లిపేరు అంకమాంబ. ఈతనితండ్రిపేరు మారయ్య యనియుఁ దల్లిపేరు సంకమాంబ యనియుఁ గొంద ఱభిప్రాయపడిరి. వార ట్లభిప్రాయపడుటకుఁ గారణము లేకపోలేదు. ఆంధ్రభాషాభూషణము

  1. నతిశయంబు.