పుట:Andhra-Bhashabhushanamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రభాషాభూషణము

15

    ననఁగ వరుస నివి యుదాహరణంబులు
    నుతగుణాభిరామ నూత్నదండి. 55

క. కుఱుచలతుది హల్లులకున్
   బిఱుఁద న్నెలకొన్నయట్టిబిందువు లెల్లన్
   నెఱయఁగ నూఁదుచుఁ దేలుచు
   నొఱపై యిరుదెఱఁగుఁ జెల్లుచుండున్ గృతులన్. 56

క. ననుఁ గను నన్నుం గను దా
   ఘనుఁడు ఘనుం డనఁగఁ జెల్లుఁ గవ్యనుమతిచేఁ
   దను బోఁటి లోభివాఁ డితఁ
   డన నిడుపులమీఁదిబిందు లరబిందు లగున్. 57

క. [1]కుఱుచలపై యరబిందులు
   నెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్
   నెఱయవు గద్యంబులలో
   నెఱబిందువు లూఁదుబద్యనికరములోనన్. 58

క. నన్నును నిన్నునుఁ దన్నును
   న న్నందుల కునుల కినులయందును మును పై
   నున్న నకారపుఁ బొల్లులు
   పన్నుగఁ [2]బోఁ జూపు నచ్చుపై నున్నయెడన్. 59
   

  1. ఇందలిపాఠభేదాదులు పీఠికలో జూపఁబడినవి.
  2. బొడసూపుసున్న; బొడసూపు నొకఁడు.