పుట:Andhra-Bhashabhushanamu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రభాషాభూషణము

3


ప్పొ ప్పనకుఁ డొప్పు త ప్పని
చెప్పకుఁ డీ కవు లుపాస్తి చేసెద మిమ్మున్.

9


క.

గుణదోషంబు లెఱిఁగి యిది
గుణమిది దోష మనిపూజఁ గొందురు సుకవుల్
గుణదోషము లెఱుఁగక దు
ర్గుణములె గుణములనిపూజఁ గొందురుకుకవుల్.

10


ఉ.

క్రొత్తగ నాంధ్రభాషకు[1]ను గొండొకలక్షణ మిట్లు [2]చెప్పెనే
యుత్తమబుద్ధి [3]వీఁడ యని యోరలు వోవక విన్న మేలు మీ
రొత్తిన మీకు మాఱుకొని యుత్తర మిచ్చుట చాలవ్రేఁగు మీ
చిత్తమునందు [4]న న్నెరవు సేయకుఁడీ కవులార మ్రొక్కెదన్.

11


క.

నేరములు కాళిదాసమ
యూరాదుల కైనఁ గలుగ నొరులకు లేవే
సారమతు లైన సుకవుల
కారుణ్యము కలిమి నేర్పు కవిజనములకున్.

12


తే.

కంచి నెల్లూరు మఱి యోరుఁగ [5]ల్లయోధ్య
యనుపురంబులపై గంగ కరుగు మనిన

  1. నొకొండొక
  2. చెప్పునే
  3. నీతఁ డని.
  4. ‘నన్ను కవి’ పాఠాంతరము.
  5. 'ల్లవంతి' అని పాఠాంతరము గలదు.