పుట:Andhra-Bhashabhushanamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxv


ములు చూచినఁగాని కొన్నివిషయములు నిర్ణయింప వీలులేకపోయినది. చెన్నపురిలో నున్న ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమునను, కాకినాడలోనున్న యాంధ్రసాహిత్య పరిషద్భాండాగారమునను గల తాళపత్రగ్రంథములును కాకితపుఁబ్రతులును ముఖ్యమగువిషయములకై పరిశీలించితిని. పుస్తక మంతయును ఆప్రతులతో సరిచూడ నవకాశము గుదురలేదు. ఇదివఱకును ముద్రించినప్రతి వ్రాఁతప్రతులతో సరిచూచినదే గాన మరలఁజూచుట యావశ్యకము గాదనియుఁ దోఁచినది. ఆంధ్రగ్రంథప్రకాశకులగు వావిళ్ల వారియెడ నాంధ్రలోకమెంతయో కృతజ్ఞత చూపఁదగును.

రామచంద్రపురము,

ఆంగీరసశయనైకాదశి.

ఇట్లు, భాషాసేవకుఁడు,

శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి.