పుట:Andhra-Bhashabhushanamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xix


త్పూర్ణో౽పి భవేద్దీర్ఘా చ్చేత్ఖండ ఏవ స జ్ఞేయః" "సున్న సిద్ధము, సాధ్యము అని ద్వివిధము. ఆబిందువే పూర్ణము, ఖండము అని రెండువిధములు గలది. హ్రస్వముకంటెఁ బరమయిన ఖండబిందువు పూర్ణబిందు వగును. దీర్ఘముకంటె బరమయినది ఖండబిందువే యని తెలియ దగును." అని పయిశ్లోకమునకు భావము. ఇందు హ్రస్వముమీఁది ఖండబిందువు పూర్ణబిందువగుననియు, దీర్ఘముమీఁదిది ఖండబిందువే యనియుఁ జెప్పఁబడినది. ఇంరు అర్ధబిందువు పూర్ణబిందువగుట విధేయవిషయము. కేతనగ్రంథమున దీనికిఁ గేవలము వ్యతిరేకముగాఁ బూర్ణబిందు వర్ధబిందువగుట విధేయము. రెండును బరస్పరవిరుద్ధములు. రెండిటిలోఁ గేతన ప్రక్రియయే ప్రాచీనమతపోషకమును ప్రాచీనతరము ననక తీఱదు. చింతామణిలోనిభావమును బ్రక్రియయుఁ గేతనకాలపుభావముకంటె నవీనమని చెప్పక తప్పదుగదా? అది కేతనకాలమునకు నిన్నూఱుసంవత్సరముల క్రిందటనున్న నన్నయభట్టుకాలములోని భావమనుట కవకాశము గనఁబడదు.

కానిండు ప్రాచీనార్వాచీనతలమాట యటుండనిత్తము. మాటవరుసకుఁ జింతామణి కేతనకుఁ బూర్వమే రచితమయినదని యొప్పుకొన్నను కేతన యిది చూచియుండఁడు. చూచియున్నచోఁ దా