పుట:Andhra-Bhashabhushanamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xviii

ఇట నెఱబిందువులందు అనుచోట నెఱబిందువు లూఁదు అని పాఠాంతరము పుట క్రిందిభాగమునఁ జూపఁబడినది. ఇందు నిపుడులమీఁది బిందువులు గద్యములలో నూఁదుననియుఁ బద్యంబులలో నూఁదవనియుఁ గలదు. అది సంగతముగాదు. గద్యములలో నూఁదుట లేదు. పూర్ణబిందుపూర్వకప్రాసమున్నచోటఁ బద్యములలోనే యూఁదుట గలదు. కావున "నెఱయవు గద్యంబులలో, నెఱబిందువు లూఁదుఁ బద్యనికరములోనన్." అని సవరణ చేయఁబడినది.

హ్రస్వములమీఁది బిందువు లూఁదిన నూఁదవచ్చును. తేల్చి పలికినను తేల్చి పలుకవచ్చును. దీర్ఘములమీఁది బిందువు లరబిందువు లగును. అనఁగాఁ దేల్చి పలుకవలయును. హ్రస్వములమీఁది బిందువులు గద్యమునఁగూడ వచనరచనానుకూలముగా నూఁదిన నూఁదవచ్చును. గద్యములలో దీర్ఘములమీఁది బిందువు లూఁదవు. పద్యములలో నూఁదవచ్చును. అని పైదానితాత్పర్యము. కేతనవ్యాకరణమునఁ బూర్ణబిందు వర్ధబిందు వగునని విధింపఁబడినది.

ఇంకఁ జింతామణిపద్ధతి పరిశీలింతము. "సిద్ధస్సాధ్యశ్చానుస్వారః పూర్ణార్థభేదతో ద్వివిధః, హ్రస్వా