పుట:Andhra-Bhashabhushanamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiii


గ్రంథము లభింపక కల్పితపాఠసహితములు లభించుటచేతఁ బ్రాచీనగ్రంథముల కీపాట్లు గలిగినవి.

ఒకవేళఁ జింతామణి నన్నయభట్టకృతమని సిద్ధాంత మొప్పుకొన్నను ఆగ్రంథము కేతనదృష్టికి గోచరమయినదన నవకాశము లేదు. కేతనకవి యాంధ్రశబ్దచింతామణి చూచియున్నచో దాని ప్రశంస చేసియుండునుగదా. అంతేకాక "ఆంధ్రభాషాభూషణ మనుశబ్దశాస్త్రమున్ రచియింతున్" అని పెద్దప్రతిజ్ఞ చేసిన కేతన చింతామణిలోని విషయములును వ్యాకరణరచనాపద్ధతియును గ్రహించియుండును లేదా దానికంటెను శాస్త్రప్రక్రియానుకూలముగాఁ దాను వ్యాకరణము రచించియుండును. విమర్శించినచోఁ గేతనగ్రంథముకంటెఁ జింతామణి వ్యాకరణసంప్రదాయానుసారముగా నున్నది. ప్రక్రియావిషయమునఁ జింతామణియే సయుక్తికముగను, శాస్త్రీయముగను నున్నది. కేతనకవికిది మొట్టమొదటిప్రయత్న మనుటకు నిదియుఁ దోడ్పడుచున్నది. అది కేతన చూచియున్నచో నాంధ్రభాషాభూషణము నింతకంటె విపులముగను వ్యాకరణసంప్రదాయయుక్తముగను జేసియుండును. ఒకవేళ దానియం దనాదరము గలిగెనేని అందలివిషయములు ఖండించి, నిరసించి యుండును. చింతామణిప్రక్రియకుఁ గేవలము వ్యతిరేక