పుట:Andhra-Bhashabhushanamu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

x


వ్యాకరణము రచించినట్లు సూచింపఁబడుచున్నదని కొంద ఱందురు. అది సుసంగతము కాదు. ఏలయన "నన్నయభట్టాది కవిజనంబులకరుణన్" అనుటవలన ఆంధ్రభాషాభూషణ మనులక్షణగ్రంథము రచించుటకు నన్నయభట్టాదికవుల భారతాదిగ్రంథములు లక్ష్యములుగాఁ గేతన గ్రహించెనని గ్రహింపఁదగును. కేవలము నన్నయభట్టకృతమనఁబడు వ్యాకరణమని గ్రహించినచో నన్నయభట్టాది కవిజనంబులనుచోట అదిశబ్దకవిశబ్దములు వ్యర్థము లగును. అది కవ్యుద్దేశమునకు వ్యతిరేకమనక తప్పదు. వ్యాకరణమునే కవి యుద్దేశించినచో స్పష్టముగా నేల చెప్పఁడు. పై పెచ్చు వ్యాకరణమెన్నఁడు నెవ్వరుఁ జెప్పలేదని కంఠోక్తిగాఁ జెప్పునా?

ఆంధ్రశబ్దచింతామణి సంస్కృతభాషలో రచింపఁబడియుండుటచేత దానిని స్మరింపలేదనియుఁ, దెనుఁగున నెవ్వరును రచింపకపోవుటచేత నెవ్వరును వ్యాకరణము రచింపలేదని చెప్పెననియుఁ గొంద ఱందురు. పద్యములలో వ్యాకరణము రచించుటకే మొదటివాఁడని మరికొంద ఱందురు. అది యాపాతమధురము. కేతనకు నన్నయభట్టునం దాదరము గలదని "నన్నయభట్టాది కవిజనంబులకరుణన్" అనుదానివలనఁ దెల్లమగుచున్నదిగదా. నన్నయభట్టునం దంతగౌరవమున్నపుఁ డాతనివ్యాకరణమున్న