Jump to content

పుట:Anarkali (1955)-Song Booklet.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనార్‌కలి

కథాసంగ్రహం

---0---

అనార్‌కలి ప్రేమజీవులకు ఆదర్శం, ఆరాధ్యదేవత. ప్రియునికోసం ప్రేమకోసం తన మధురజీవితాన్ని బలిదానం చేసిన త్యాగమూర్తి.

పారశీకంలో పరిమళించిన 'నాదిర' (అనార్‌కలి) అదృష్టరేఖ వక్రించి ఆగ్రా నగరం తన జుట్టుతో చేరుకుంది. ఒకనాటి సాయంకాలం అక్బర్ పాదుషా దానిమ్మతోటలో పువ్వులు కోసుకుంటూ, 'అనురాగ సుధాభరితమైన జీవితమే మధురమని ఆమె పాడుకుంటూవుండగా, దారిని పోయే యువరాజు సలీం ఆమె మధుర గానానికి ముగ్ధుడై తోటలో ప్రవేశించి ఆమెను చూచాడు. ఆమె అందానికి తన హృదయం అర్పించేడు. అనార్‌కలి కూడా అతని అందచందాలకూ, అనురాగాలకూ వశ్యురాలై పోయింది. వారి ప్రేమ కధ మధుర మయింది. మనసులు ఏకమైపోయాయి అలాగా ఎవరికీ తెలియ కుండా ప్రతిదినమూ ఆ తోటలో కలుసుకొని హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఒక రోజు ఆమె గానం అక్బరుపాదుషా, విని తోటలోకి వచ్చి ఆమధుర గానానికి ముగ్ధుడై ఆమెకు అనార్‌కలి అని బిరుదిచ్చారు.

అనార్‌కలి భాగ్యరేఖ మళ్లీ వక్రించింది. ఆసమయానికే కాబూలులో బయలుదేరిన కల్లోలం అణచటానికి యువరాజును సైన్యసమేతంగా అక్బరు పంపించేడు.

అనార్‌కలికి ప్రియుడులేని జీవితం శూన్యమైపోయింది. తన నరాల సోయగాల ప్రియుణ్ణి వెదక్కుంటూ బయలుదేరింది. దారిలో బందిపోటు దొంగలు ఆమెను బందీగా చేసుకొన్నారు.

అందాలు జాలువారే అనార్‌కలిని బానిసల బజారులో విక్రయిస్తుండగా సమీపంలోనే యుద్ధ శిబిరాలలో వున్న యువరాజు సలీం ఆమెను ఎక్కువ వెలకు కొన్నాడు. ఆవసంత మధుర సీమలలో ప్రశాంతమైన వెన్నెల రాత్రిలో అనంత ప్రేమ లీలలో వరించి తరించే ఆప్రేమజీవులకు మళ్లీ విధి ఎడబాటు కలుగచేసింది. ఆరాత్రి శత్రువులు వారిశిబిరాలమీదికి దాడితీశారు. యుద్ధంలో సలీముకు బలమైన గాయం తగిలి స్మృతితప్పింది. ఆగ్రానగరానికి తీసుకు పోయేరు. అనార్‌కలి మళ్లీ అతని వెంటబడింది.