పుట:Ananthuni-chandamu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పాఠము అప్పకవీయములో ఉన్నది. (చూ. వావిళ్లవారి ప్రతి పు. 142)

IV. 22 వ పద్యమైన తర్వాత పరవస్తువారిప్రతిలో ఈక్రిందిపద్య మున్నది.

కోమటీంద్రునాఁగ భూమితీరనఁ బలు
గ్రహము లనఁగ వానకాల మనఁగ
వైరివర్గమైన వదల రిట్టివి లోక
రూఢిఁ జెల్లు నని సరోజనాభ.

IV. 107 “తనరఁగ అఆ ఇఈ లనఁగా ఉఊలు నాఁగ....' ఈ పద్యములో హ్రస్వాక్షరములే అయినా 'అ' 'ఇ' 'ఉ' 'ఋ' గురువర్ణములుగానే ఉచ్చరించవలెను. అది ఎట్లు జరుగునంటే: ఈహ్రస్వాక్షరము లుచ్చరించిన తర్వాత ఏకలఘుమాత్రాకాలము ఊపిరి ఆపి, ఆ బిగపట్టి పైవర్ణము లుచ్చరించుటచేత, ఈహ్రస్వాక్షరోచ్ఛారణలో ద్విమాత్రోచ్చారణప్రయత్నము జరిగినది.

అంతేకాని పరమందున్న 'ఆ' అనే అచ్చు ద్విత్వాక్షరమువలె ఉచ్చరించుటచేత పూర్వమందున 'ఆ' గురువు అగునని జయంతి రామయ్యపంతులు గారు చెప్పిన సమాధానము అశాస్త్రీయము. అచ్చువిషయమున ద్విత్వాక్షరోచ్చారణమంటే దీర్ఘోచ్చారణమని చెప్పవలెనేకాని వ్యంజనముల విషయమై చెప్పిన అ