పుట:Ananthuni-chandamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిచితిగలవృత్తములవలె చదువబోయినవారికి నడక చెడినదన్నభ్రమ కలుగును గాని రెండు మూడు సార్లు చదివిన పిమ్మట దీనినడక పట్టుపడగలదు. దీనిలో మొదటనున్న భగణము నలముగాను యతిస్థానమందున్న మగణము సగముగాను మార్చి క్రొత్తవృత్తములు చేసుకోవచ్చును; దీనివలెనే నడిచేవృత్తములు మరికొన్ని చెప్పవచ్చును.

ఈకవికాంతాపాదములు చతురస్రగతి చతురస్రజాతి త్రిపుటతాళమునకు (అనగా క్రియకు నాలుగు అక్షరములు చొప్పున ఆదితాళము 4 x ( 4 + 2 +2)=32 నరిగా నడుచును.[1]

టిప్పణి

1.7. “లఘువగు...యొకమాత్ర; గురువు నొదవు ద్విమాత్రన్" ఈ విషయమును గూర్చి జయంతి రామయ్యపంతులుగారు వ్రాసినది అశాస్త్రీయము.

“వ్యంజన మర్ధమాత్ర యనున్యాయముచే 'వనిత' అనునప్పుడు 'తన్' అనుగురువు సార్థమాత్రక మగును; 'అనగాన్’ అనుచో “గాన్” అనుగురువు సార్థద్విమాత్రకమగును” అని వ్రాసినారు.

  1. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో “ఛందోరహస్యదర్పణము — పద్యరచనావ్యవస్థ” అను పేరుగలవ్యాసములో ఇక్కడ సంగ్రహించి చెప్పిన విషయములు కొన్ని విపులముగా చర్చించినాను.