పుట:Ananthuni-chandamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. ఖండగతిని నడిచేవి (అనగా 5 మాత్రల గణములు గలవి). త్వరితగతి, పద్మనాభము, లయగ్రాహి, దండకము మొదలయినవి.

6. ఖండగతిని ఎదురుగా నడిచేవి. (అనగా యగణములు గలవి). భుజంగప్రయాతము ఇటువంటివి అనేకముగా లేవు.

7. రూపక తాళమునకు సరిపడే వృత్తములు (అనగా మాత్రలకు విరుగుతూ నడిచేవి).

మదరేఖావృత్తము:— ఇట్టివి అనేకముగా లేవు; గాని, కావలసినన్ని సులభముగా కల్పించవచ్చును. చూడండి:-

I.

అనుసారిణి యనువృత్తం + బగునతివృతి యను ఛందం
బున రూపక మనుతాళం + బున నడుచును శ్రుతి కింపై
చను నాలుగుచరణంబుల్ + సన యననస గము లొప్పన్
ననయంబులు చనునంతన్ + జరణములను వడి నిల్చున్.


II.

రూపక మనుతాళంబున + ద్రుతలఘువులు చనుచుండున్


III.

నలగముపై సగ మొప్పున్ + నలగమముల్ జోడింపన్


IV.

క్రాలున్ తల నలలల మస + గంబుల్ పాదములందున్


V.

కల్యాణిన్ మనలలలస + గభగంబుల్ పాదములన్

ఈలాగున క్రొత్తక్రొత్తవృత్తములను ఎన్నైనా తీయవచ్చును.

8. మిశ్రగతిని నడిచేవి (అనగా 3+4 మాత్రలకు విరుగుతూ నడిచేవి).