పుట:Ananthuni-chandamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

II త్రిభంగి.

ఈ గ్రంథమందు మూలమున (చూ. II. 134) త్రిభంగి వృత్తము అచ్చుతప్పులతో నిండియున్నది. సరియైన పాఠము: —

నననన ననసస + లును భమసగలును +
             దనరి నటింపఁ గణంకన్ నలువంకన్ బెంపు దొలంకన్
మునుకొని నఖముఖ + మున వెడఁగ దలుపఁ +
             జనుగడు నొప్పగువీణల్ నెరజాణల్ వేలుపుగాణల్
వనరుహజనితుని + తనయులు మొదలుగ+
             ఘనషతు లాడుటతోడన్ శ్రుతిగూడన్ వెన్నుని బాడన్
వినగలిగిన నది + జననము ఫలమని +
             మునిజను లిందు శుభాంగున్ దగుభంగిన్ జెప్పుఁ ద్రిభంగిన్.

పాదమునకు 34 అక్షరములు; 42 మాత్రలు; పూర్వార్ధమున ప్రాసనియతి, పశ్చిమార్ధమున మూడుచోట్ల అంత్యప్రాసనియమము ఉన్నవి. కావ్యాలంకారచూడామణి అప్పకవీయములలో సైతము ఇట్లే ఉన్నది. కానీ, కవిజనాశ్రయములోని త్రిభంగి ఇందుకు భిన్నముగా ఉన్నది.

ననననలును నసభములును సగయుక్తము లైనన్
             మృదువైనన్ బ్రస్తుతమైనన్
వసరుహభవనిభ! మనమలరఁ ద్రిభంగిని జెప్పున్
             వడి దప్పున్ బ్రాసము లొప్పున్.