పుట:Ananthuni-chandamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇదిపాదమున కెన్నేసిలఘువులుగల వృత్తము లెన్నెన్ని ఒక్కొక్కఛందమున బుట్టినవో తెలియజేసే లగక్రియచక్రము. మీదిచక్రములో అయిదవఛందమువరకు ఉన్నది. అయిదవచాలున కనబడే 1,5,10,5,1 అనేఅంకెల అర్థమేమంటే, ఒక్కలఘువైనా లేక అన్నీ గురువులు గలవృత్తము 1; ఒక్క లఘువుమాత్రమే కలవృత్తములు 5; రెండులఘువులు కలవి 10; మూడులఘువులు కలవి 10; నాలుగులఘువులుకలవి 5; అయిదున్ను లఘువులే అయినవృత్తము 1; మొత్తము 32.

ఈలాగుననే మీది వరుసలలో మొదటిఛందమునుండి నాలుగోఛందమువరకు పైని చెప్పిన విషయముల వివరణ ఉన్నది.

అయితే మీది వరుసను బట్టి కిందివరుస వేసుకొంటూ ఉంటేనేగాని 8వ ఛందములోనో 16 వ ఛందములోనో మరి యేదైనా ఛందములో ఈవృత్తములసంఖ్యలు తెలియజేయుట కష్టము; గనుక, ఇంగ్లీషుబడులలో చదువుకొనే విద్యార్థులు ఈవిషయములను తెలుసుకొనుటకు ఒక సులభమైన మార్గమున్నది. దీనినిబట్టి అడిగిన ఛందముగురించి ఈవిషయములు వెంటనే చెప్పగలము ఉ॥ పదియవ ఛందములో ఎన్నెన్నిలఘువుల వృత్తము లెన్నెన్ని ఉన్నవి?

(గు+ల)10=1గు10 + 10గు91 + 45గు82 +120గు73 + 210గు64 + 252గు55 + 210గు46 + 120గు37 + 45గు28 + 19గు19 + 1ల10