పుట:Ananthuni-chandamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“తపశియ న్నువపొడ వునల్లని దీర్ఘ॥ తనువు(ను) । జూచి.”

ఇందులో సూర్యగణముగా ఉండవలసిన 3వ గణము, ఇంద్రగణముగా ఉండవలసిన 4-వ గణము ఎట్లు కుదిరినవి?

మరియొక విషయము:——అర్ధానుస్వారములు ఉండదగినచోట్లకూడా పూర్ణానుస్వారములే పాటించవలె నన్నవాదము శాసనాక్కరల లక్షణము నిరూపించుటకా? నన్నయమధ్యాక్కరల లక్షణము నిరూపించుటకా?

పై పద్యములో మొదటి పాదము శాసనలేఖనసంప్రదాయమును బట్టి, “అవసరజ్ఞుణ్డైన వేదవ్యాసుణ్డె తెఞ్చె నన్త నత్తపసి" అని వ్రాయవలెను. ఇట్లున్నప్పుడు ఇది శాసనాక్కరల లక్షణమునకు ఎట్లు లొంగినది?

నన్నయ మధ్యాక్కరలకోసము ఒక విధమైన లేఖనసంప్రదాయమున్ను శాసనాక్కరలకోసము మరియొకవిధమైన సంప్రదాయమున్ను గ్రహించవలె ననుటకు తగిన ఆవశ్యకత కనబడదు. నన్నయ వ్రాసిన తాటాకులపుస్తకము మనకు చిక్కదు; గానీ, శాసనకాలమునకున్ను నన్నయకాలమునకున్ను అట్టే అంతరము లేనందున ఆకాలపు లేఖనక్రమము శాసనములోనున్నట్లు ఉండవచ్చునని ఊహించుట తప్పుకాదు.

ఈ విషయములన్నీ విమర్శించి చూడగా శాస్త్రులవారు సూచించిన మార్గము నన్నయమధ్యాక్కరల లక్షణము తెలుసు