పుట:Ananthuni-chandamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రధానప్రాసభేదములలో లళడ ఋక్రాంతప్రాసములపద్యములు మూడు కవిజనాశ్రయములో ఉన్నవి. ఈపద్యములే కావ్యాలంకారచూడామణిలో కూడా ఉన్నవి. ఇవి ఎవరివో తెలియదు. ఇంతకు మించి ప్రాసభేదములు ఈలక్షణగ్రంథములలో లేవు. ఈలక్షణగ్రంథకర్తలు నన్నయ భారతములోని పద్యములందు గల ప్రాసభేదములను చక్కగా పరిశీలించలేదని చెప్పవచ్చును.

అనంతుడు సమప్రాసవిధులు చూపించి మరి పదకొండువిధములైన విశేషప్రాసముల గురించి చెప్పినాడు. (మూలము 10.వ పుట చూడుము.)

అనంతుడు చెప్పిన పండ్రెండువిధములేకాక అతడు చెప్పక విడిచిన మరి యేడు విశేషములు అప్పకవి చెప్పినాడు. అవి ఏవంటే:—

(1) వేఁడు, పండ్లకు.
(2) లోక, (భా)షాకౢప్తకు.
(3) సషలకు.
(4) తమ్ములు, (భ)క్తి మ్ముర (భక్తిన్ + ముర) లకు
(5) దధలకు, ందంథలకు.
(6) లఘ్వలఘు యకారప్రాసము.
(7) లడలకు.

ఈ ప్రాసములలో కొన్ని అనంతునికి పూర్వము ప్రసిద్ధులయిన కవులు వాడినారు గనుక కొంతవరకు అతని పరిశీలనలో లోపమున్నదని చెప్పక తప్పదు.