పుట:Ananthuni-chandamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లోకితషడ్వర్గంబులు
శ్రీకలితచ్ఛంద మవధరింపుము కృష్ణా!

129


ఉ.

శ్రీనిధి చక్రవర్తిగురు శేఖర పుణ్యకటాక్ష లబ్ధ సు
జ్ఞానుఁ డనంతధీమణిలసన్మణి భోజచరిత్ర చెప్పి ల
క్ష్మీనరసింహుఁ గూర్చి నప్రసిద్ధుఁడు వేడుకతో నొనర్చె ఛం
దోనుతి యోగిహృద్విమలతోయజవర్తి కనంతమూర్తికిన్‌.

130


ఉ.

రాజులు పాడిఁ దప్పక ధరావలయం బఖిలంబు నేలెడిన్‌
భూజనరాజి సంపదలఁ బొంపిరివోని సుఖానుభూతిచే
నోజఁ జరింపుచుండెడిఁ బయోజసముద్భవకల్పశాశ్వతం
బై జలజోదరాంకితమహాకృతి సన్నుతినొందుచుండెడున్‌.

131

గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవతిక్కనామాత్యతనూభవ సుకవిజనవిధేయ యనంత
యనామధేయ ప్రణీతం బైన ఛందోదర్పణమునందు వర్జనీయంబు లగు
దశదోషంబులనేర్పఱుచుటయు, నందుదోషరహితంబులై
యాదరణీయంబు లగు పట్లు దేర్చుటయుసంధి
సమాసంబులు పంచాశద్వర్ణంబు
లేర్పఱుచుటయు నన్నది
చతుర్థాశ్వాసము