పుట:Ananthuni-chandamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జగమునఁ గ్రియావిశేషణ
మగు నీయెడ శాశ్వతముగ నని పల్కుట దాన్‌.

119


గీ.

శబ్దసిద్ధికొఱకు సంధిసమాసరూ
పంబు లిట్లు కొంతపలుకఁబడియె
మఱియు నుచితరీతి నెఱుఁగంగవలయు ర
హస్యలక్షణంబు లాంధ్రకవులు.

120

మఱియుం బంచాశద్వర్ణంబులు—

క.

భూమిఁ బదాఱచ్చులు వాఁ
గా మెఱసి అకారమాదిగా స్వరము లగున్‌
కా మొదలు క్షకారముతుద
యై ముప్పదినాల్గుహల్లు లగు వ్యంజనముల్‌.

121


క.

తగు హ్రస్వంబులు దీర్ఘము
లగు అఇఉఋఌలును వెండి హ్రస్వాభావం
బగు ఏఐఓఔలు నె
సఁగు అం అః అనఁగ షోడశస్వరము లగున్‌.

122


క.

కచటతప వర్గవర్ణము
లెచటన్‌ స్పర్శ లగు నిరువదే నై మఱి యం
దుచితగతిన్‌ ఙఞణనమ
ప్రచయం బను నాసికాఖ్యఁ బ్రస్తుతినొందున్‌.

123


క.

యరలవ లంతస్థలు నాఁ
బరఁగును శషసహలు తేటపడు నూష్మలనన్‌