పుట:Ananthuni-chandamu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ద్విగు వగు సంఖ్యాపూర్వక
మగుచు సమానాధికరణ మగుచుఁ బ్రసిద్ధం
బుగఁ గర్మధారయాహ్వయ
మగుఁ దత్పురుషంబ యీక్రియన్‌ భిన్నగతిన్‌.

96


క.

ఏయది సంఖ్యాపూర్వక
మై యలవఁడు బలుక ద్విగుసమాసం బది దా
నీయదుపతికీర్తిం దెలు
పాయెఁ ద్రిలోకి యన నీసమాహారోక్తిన్‌.

97

కర్మధారయము—

క.

ఏమిటి కెయ్యది గుణమై
తామెఱయుచు నుండు నది మొదల నిడి పలుకన్‌
భూమి నది కర్మధారయ
మౌ మధురోదకము మేచకాభ్రం బనఁగన్‌.

98


క.

అందముగఁ గర్మధారయ
మందు మహాత్మునకు నమరు నభియోగము గో
విందుఁడు మహాత్ముఁ డనఁ జే
యందు ఫలితకల్పలత మహాలక్ష్మి యనన్‌.

99

అలుక్సమాసము—

క.

ఏక్రియ యెవ్వనికిం దగు
నాక్రియఁ దేరఁ బదమధ్యమందు విభక్తి
ప్రక్రియఁ గూర్ప నలు క్షగు
నీక్రియ ఖేచరవనౌచరేశ్వరు లనఁగన్‌.

100