పుట:Ananthuni-chandamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నలిఁ గర్మధారయము ని
ర్మలావ్యయీభావమును సమాసము లరయన్‌.

85


వ.

అందుఁ బూర్వపదార్థ ప్రధానంబవ్యయీభావంబు నుత్తర
పదార్థప్రధానంబు తత్పురుషంబు నుభయపదార్థ ప్రధానంబు
ద్వంద్వంబు నన్యపదార్థ ప్రధానంబు బహువ్రీహియు నగు
నందు ద్వంద్వంబు.

86


క.

పెక్కైనను రెండైనను
జొక్కపుశబ్దములు గదియుచో ద్వంద్వ మగున్‌
మ్రొక్కెద బలకృష్ణుల కన
నక్కిటికమఠాద్రు లుర్వి కాధార మనన్‌.

87


గీ.

వ్యస్తపద మయ్యెనేని సమస్తమైన
ద్వంద్వమున కంత్య పదము చందము విభక్తి
అంబువులు గోవు ద్విజుఁడు శుద్ధాత్ము లనఁగ
నంబుగోద్విజుల్‌ శుద్ధాత్ము లనఁగ నిట్లు.

88


గీ.

చేయవలయు మాతాపితృసేవ యనఁగ
మహితరుచులు సూర్యాచంద్రమసు లనంగ
నాదిమునులు మిత్రావరుణాఖ్యు లనఁగ
ద్వంద్వమున సంధిదీర్ఘము ల్వచ్చు నిట్లు.

89


క.

అల సంస్కృతమునఁ బోలెన్‌
వల దల్పాచ్చునకు నిచట ద్వంద్వపునియతుల్‌
తెలుఁగు లనుగ్రహనిగ్రహ
ములు నాఁగను బుణ్యపాపములు నాఁ జనుటన్‌.

90