పుట:Ananthuni-chandamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేఫయగుఁ దుది నచ్చున్న రేఫయున్నఁ
గ్రాఁగు వారాకరంబు వారాశి యనఁగ.

79


క.

అత్వాంతవిసర్గ యుడుగు
నిత్వాదుల రత్వమొందు ఋత్వము తుదరా
నత్వము తపఋద్ధి యనఁగ
సత్వయుతా నిరృతియనఁ బ్రశస్తం బగుటన్‌.

80


క.

తల మగు రేఫాంతవిస
ర్గలమీఁద ఋవర్ణ మొనరఁగా సంధి విస
ర్గ లుడిగి రేఫయు ఋత్వము
గలిగియు బునరృతు సమేత కమలాక్షి యనన్‌.

81


గీ.

స్వాదిసంధిలోపలి విసర్గాంతవర్ణ
సంధు లెన్ని యన్నియును విసర్గసంధి
యందె కలిసివచ్చుటఁజేసి స్వాదిసంధి
వేఱ యొనరింపబడదు వివేకరూఢి.

82


వ.

మఱియు నొక్కవిశేషసంధి.

83


క.

ఉపరిని హల్సంయుతమై
నపు డూఁదును స్వరసమన్వితాక్షర మగునే
నపు డూఁద దాదివర్ణము
ప్రపాద్వయము పరికృతంబు పరికౢప్తి యనన్‌.

84

మఱి సమాసంబులు—

క.

లలితద్వంద్వబహువ్రీ
హులు తత్పురుషము నలుక్కు నుద్యద్ద్విగువున్‌