పుట:Ananthuni-chandamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కపట మనఃఖేదము లనఁ
దపఃఫలం బనఁ దపఃప్రతాపం బనఁగన్‌.

68


గీ.

కపల మొదలిరెం డ్లగు దుర్నిర్గుపరిసంధి
షత్వ మగు దుష్పదంబు నిష్ఫల మనంగ
జరగు దుష్కర్మ మనఁగ నిష్కర్మ మనఁగఁ
జెల్లు దుష్పీత మనఁగ నిష్పీత మనఁగ.

69


క.

పొలుపుగఁజటతాదియుగం
బుల శషస లెనయ విసర్గపొందు ననన్‌ వా
శ్చలనముఛందష్టీకలు
లలితయశస్తతి మిథశ్చలంబు లనంగన్‌.

70


క.

అలరు నికారాదివిస
ర్గలపై వర్గాపరాక్షరద్వయగణముల్‌
యలహవలు గదియ రేఫల్‌
గలియు హవిర్భుజధనుర్భలంబు లనంగన్‌.

71


క.

మొదలి విసర్గలమీఁదన్‌
బొదలిన శషస లవి యూఁదు భూరియశస్సం
పద యనఁ గాసుమనష్ష
ట్పదము లనఁగ నధిక మగు తపశ్శక్తి యనన్‌.

72


గీ.

అవ్యయాంత విసర్గ వర్గాక్షరముల
రెంట ణనమయలవహల రేఫ రేఫ
గాక పెఱవర్ణములఁ గారకంబులట్ల
గదియు స్వర్గజం బనఁగ స్వఃకాంత యనఁగ.

73