పుట:Ananthuni-chandamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చెచ్చెర ఇఉఋలు మూఁటికి
నచ్చు పరం బైన యవర లాదేశ మగున్‌
మెచ్చగ దధ్యన్నం బనఁ
బెచ్చుగ మృద్వన్న మనఁగఁ బిత్రర్థ మనన్‌.

42


క.

తగునేఅన మన నయనం
బగుఁ బోఅ మనఁగఁ బవన మగు నైఅక నా
నగు నాయక పౌఅకయన
నగుఁ బావక ఏజవాప్తి నయవాయావల్‌.

43


గీ.

సరవి నీలాల్గుపదమధ్యసంధులందు
నప్రసిద్ధ మేకారాంత మైత్వమునకు
నోత్వమునకు నౌత్వమునకు నొగిఁ బదాంత
సంధి నగు విశేషంబు లేచంద మనిన.

44


క.

గోశబ్దముపై నవఙా
దేశమున గవాక్ష మనఁగ దీపించు నవా
దేశము ద్యోశబ్దముపై
నాశక్రుండు ద్యవధీశుఁ డన సత్సంధిన్‌.

45


క.

రైశిఖరాచ్చున కాయా
దేశం బగుసంధి రాయధీశ్వరుఁ డనఁగా
గ్లౌశిఖరాచ్చున కావా
దేశం బగుసంధి గ్లావుదీర్ణ యనంగన్‌.

46


క.

మొదలియకారము ఇఉఋలు
పొదవిన నేత్వమును నోత్వమును రేఫయుఁ బెం