పుట:Ananthuni-chandamu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావిరోధము—

క.

తాళము పట్టక చదువున్‌
బోలఁగఁ బుస్తకముజేత ముట్టక పాడున్‌
మే లితనిజాణతన మన
నోలి నిది కళావిరోధ ముదధివిహారా!

32

దేశవిరోధము—

క.

బహుకూపతటాకోదక
మహితము మరుదేశ మని సమర్థించిన ని
మ్మహి నది దేశవిరోధా
వహ మండ్రు కవీంద్రు లమృతవారిధిశయనా!

33


క.

ఇట్టివి దశదోషము లనఁ
బట్టగుఁ గృతులందు నివియ భాసురముగఁ జే
పట్టుదురు ధీరు లొక్కొక
పట్టున డెందమ్ము లలరఁ బల్కినఁ గృష్ణా!

34


క.

పదిదోషంబులఁ దెలిపెడు
నదనఁ బ్రయోగించినట్టి యవయోగములం
దొదవవు దోషంబులు నీ
సదమల నామములఁ గూడఁ జలుపుటఁ గృష్ణా!

35


క.

క్రమమున నిటుచెప్పిన దో
షములం దత్యుత్కటము విసంధిక మని రా
దిమునులు తత్పరిహారా
ర్థము సంధి సమాసములు దిరంబుగఁ జేర్తున్‌.

36