పుట:Ananthuni-chandamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డిదె వచ్చెడి నన నెగ్గై
యొదవిన యీచుట్టుఁబ్రావ లొల్లరు కృష్ణా!

21

వైరివర్గము—

గీ.

తుదలు తెలుఁగుఁ జేసి యదికి పుష్పవిల్లు
పరంగ భూరుహంపుఁబండ్లు నాక
పుష్పవిల్లు నాఁగ భూరుహపండ్లు నా
వైరివర్గ మండ్రు వనజనాభ!

22


గీ.

మొదలి తెలుఁగుపై సంస్కృతపద మొకండు
జరగు లోకరూఢిని సమాసంబు చొరదు
పూని ముజ్జగంబులు ననఁ బోలుఁ గాని
యతఁడు ముజ్జగద్వందితుఁ డనఁగఁ జనదు.

23

కాకుదోషము—

క.

పొలుపుగఁ బొగాడదండలు
లలన ముడిచినన్‌ మకార లాంఛనుఁ డొందెన్‌
జలమునఁ జెఱాకువి ల్లన
నల నిడుదలఁ గాకు దోషమండ్రు ముకుందా!

24

కుఱుచకాకు—

క.

ఎలుఁగుపడ నీవు చెపుమా
యెలిక వనుచు నసపడితిమి యెమి నివు నయెడన్‌
చలుఁజలు ననునిడుపులు గుఱు
చలు సేసినఁ గుఱుచకాకు చను నిది కృష్ణా!

25

దుష్ప్రయోగము—

క.

సత్వరము నృపస్యపదం
గత్వా యాతఁడు నిహత్య కంటకుల సఖీ