పుట:Ananthuni-chandamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. అపశబ్దము—

ఆ.

కనుఁగొనంగ నాదికవులకావ్యంబుల
లలితమైన లక్ష్యలక్షణముల
రూఢిగాని పెఱవిరోధోక్తు లపశబ్ద
సంజ్ఞికంబు లండ్రు జగతిఁ గృష్ణ!


వ.

అవియెయ్యవియనినం గుసంధి, దుస్సంధి, చుట్టుంబ్రావ, వైరి
వర్గంబు, కాకుదోషంబు, కుఱుచకాకు, తెనుంగునకుఁ జొరని
సంస్కృతక్రియలంబెరయు దుష్ప్రయోగంబులు మఱియు
నిట్టి గ్రామ్యంబు లెన్ని గల వన్నియు నపశబ్దంబులు
వాని వివరించెద.

18

కుసంధి—

క.

మొదల నికారముపైన
చ్చొదవి యకారముగ దీనియొడయం డిది యె
ట్లొదవె ననక దీనొండయం
డిదెట్లొదవె ననుఁ గుసంధు లిన శశినయనా!

19

దుస్సంధి—

క.

క్షితి స్వరసంధి నకారం
బతిశయముగ నతఁడు నతఁడు ననుచో నతఁడు
న్నతఁడు నని యూఁది పలికిన
సతతము దుస్సంధి యండ్రు సత్కవులు హరీ!

20

చుట్టుబ్రావ—

క.

మొద లాఱు వడ్డి మూఁ డనఁ
గదియింపక యెత్తి కట్టి ఖరమున నగువాఁ