పుట:Ananthuni-chandamu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. అపక్రమము—

క.

పదమున నాభికమలమున
హృదయమునఁ బయోజభవ రతీశ్వరదివిష
న్నదు లుదయించెం గమలా
స్పదనకు నను వ్యుత్క్రమం బపక్రమ మయ్యెన్‌.

12

7. వ్యర్థము—

క.

మును దాఁ బలికినమాటకు
ననుగుణములు గాక వ్యర్థ మగుమాటలతోఁ
బెనఁచిన నది వ్యర్థంబనఁ
జనుదోషం బనిరి కావ్యచతురులు కృష్ణా!

13


గీ.

త్యాగి వగుదు నీవు తారంబు వెట్టవు
చేరి నిన్ను నడుగు వారు పెద్ద
యింకఁ గీర్తి బ్రాతియే యని యొరుఁ బల్క
వ్యర్థదోష మండ్రు వనజనాభ!

14


గీ.

ప్రేమ మెఱిఁగి వాఁడు బిగియుచు నున్నాఁడు
వానిఁ గసనెయొల్ల వాడుఁ నాకుఁ
గూర్పఁ దెఱఁగు లేదొకో నాఁగ విరహిణి
యందు నిట్లు వ్యర్థ మమరుఁ కృష్ణ!

15

8. అపార్థము—

క.

కరిచర్మము గైరికశిల
సురగిరి యని సముదయార్థశూన్యపదంబుల్‌
బెరసిన నపార్థ మగు నది
జరగు మదోన్మత్తబాలచరితలఁ గృష్ణా!

16