పుట:Ananthuni-chandamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నర్థపునరుక్తి యగుఁ గీర్తి నమృతకిరణుఁ
దని యశోమృగాంకుం డన నబ్జనాభ!

8


క.

పునరుక్తి దోష మొందదు
దనరుపదావృత్తి నభిమతంబుగ వీప్సన్‌
జనువినుతాభీక్ష్ణ్యంబునఁ
బొనరు క్రియాసమభిహారముననండ్రు హరీ!

9


సీ.

ఈ వెన్నమ్రుచ్చు దా నిల్లిల్లు దప్పక
           చొచ్చుఁ బొమ్మన వీప్స సొంపుమిగులు
ఇటువచ్చివచ్చి నీవేల నిల్చితి కృష్ణ
           యనిన నాభీక్ష్ణ్యంబు పొనరియుండు
ఇమ్మిమ్ముశౌరికి నిమ్మపం దనఁ గ్రియా
           సమభిహారంబు ప్రశంస కెక్కు
నీ చక్కఁదనమును నీమంచితనమును
           బ్రీతిఁ గన్గొని ధాత్రి వ్రేత లైరి


గీ.

దండకావనంబు తాపసు లనఁ బదా
వృత్తి యుల్ల సిల్లు వినులకృతుల
భూరిపుణ్యశీల పునరుక్తిలాలన
ప్రకటపుణ్యశోభ పద్మనాభ!

10

5. సంశయము—

కడఁగి వానిఁ గదియఁగాఁ గదా నేఁడు నీ
కింతపట్టుగలిగె నిందువదన
ఊరకున్నఁ గలదొకో యని సంశయా
ర్ధముగఁ బలుక సంశయము ముకుంద!

11