పుట:Ananthuni-chandamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వళ్లు పేర్కొన్నవారికి పరిశీలన లోపముకలిగినదా? లేక, ఎక్కువగా చెప్పిన వారు అనవసరముగా వళ్లసంఖ్య అధికము చేసినారా? లేక, కవులు స్వతంత్రించి క్రొత్తక్రొత్త ప్రయోగములు చేసి ఉండుటచేత తర్వాతి లాక్షణికులు వళ్లసంఖ్య ఎక్కువ చేయవలసివచ్చినదా? ఈవిషయములు చక్కగా విమర్శించవలసి ఉన్నది గనుక కవిజనాశ్రయము, కావ్యాలంకారచూడామణి, ఛందోదర్పణము, అప్పకవీయము - ఈ నాలుగింటిలో ఉన్న వళ్లభేదములు ఒక పట్టికలో చూపించి విమర్శించుచున్నాను:—