పుట:Ananthuni-chandamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భానుయుతనలభసగగంబుల
           లోననిరుదోలుననగంబుల
నిరవుగా నిరుమాఱులఘువుల
           నెల్లవారును నొగి గణింపఁగ
విరతులను గావింపనిమ్ముల
           హరిణగతి చెలువగు జగమ్ముల.

61

మఱియు చాటుప్రబంధలక్షణము—

సీ.

ఒకపద్య మైన ముక్తకము రెండును మూఁడు
           ద్వికమును ద్రికమునై విస్తరిల్లుఁ
బంచరత్నము లైదు పరఁగ నెన్మిది గజా
           వళికి నామావళి ద్వాదశంబు
నెన్నంగ నిరువదియేడు తారావళి
           యొనయు ముప్పది రెండు నేఁబదియును
నూఱునూటెనుబది నుతికెక్కి ద్వాత్రింశ
           దభిధాన పంచాశదాఖ్యనాఁగ


గీ.

వెలయు శతక మనఁగ వెండి యష్టోత్తర
శతక మనఁగ నిట్లు సకలసుకవి
సమ్మతముగ నెగడు జాటు ప్రబంధము
లభిమతార్థరచన నబ్జనాభ!

62

మఱియు ఉదాహరణలక్షణము—

సీ.

భాసిల్లు సప్తవిభక్తులందును మఱి
           సంబోధనంబున సరవిగాఁగఁ