పుట:Ananthuni-chandamu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అని గగనలభసలను నాల్గిటఁ గృతి
జను గజలఘువిశ్రమము మధురగతి.

58

అందు హరిగతియనురగడ—

శ్రీరామాకుచకుంకుమపంకము
           చేఁ బొలుపగు విపులోరఃఫలకము
తారతుషారపటీరసమానో
           దకవాహిని యొదవిన పదకమలము
నతిశయ మై యలవడు నేదెవుని
           ననవరతోదారత నాహరిగతి
యితరుల కలవడ దని నృప లఘుయతి
           నిభనలగగభసల నగును హరిగతి.

59

అందు వృషభగమనమనురగడ—

శ్రీమనోహరు నంబుజోదరుఁ
           జిత్తజాతగురుం దలంచెదఁ
గామితార్థవిధాయి నిర్జిత
           కాళియాహిని నాశ్రయించెద
ననువుగా [1]భగణములు భానుస
           మన్వితద్వితయములు నాలుగు
ననిమిషాధిపలఘుయతినిడఁగ
           నలరువృషభగమనము మేలగు.

60

అందు హరిణగతియనురగడ—

శ్రీనివాసు భజింతు నే నని
           పూని కుజనులపొంత బోనని

  1. భసనల