పుట:Ananthuni-chandamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దర్కింపఁగను వితాళము నందు
పేర్కొనఁ దగు హరిబిరుదులపిండు.

51

రగడలు

క.

ఆద్యంతప్రాసంబులు
హృద్యంబుగ రెంట రెంట నిడి పాదము లు
ద్యద్యతులఁ గూర్పఁ దగు నన
వద్యంబగు రగడలందు వారిజనాభా!

52

అందు హయప్రచారరగడ—

హనచతుష్టయంబు ఋతుల
జనితయతుల జరగుఁ గృతులఁ
జను హయప్రచార రగడ
వినుతశాస్త్రవిధులు వొగడ.

53

అందు తురగవల్గనమనురగడ—

శ్రీసతీశుఁ బరమపురుషుఁ జిత్తమున దలంచువారు
వాసవాదినిఖిలదివిజవంద్యు నాశ్రయించువారు
నిట జనింప రనఁగ నన్వయించుఁ దురగవల్గనంబు
పటుదినేశలఘువిరామభానుమద్గణాష్టకంబు.

54

అందు విజయమంగళమనురగడ—

శ్రీధరాయ శిష్టజననిషేవితాయ భక్తలోక
           జీవితాయ గర్వితోరుసింధురాజబంధనాయ
గాధిపుత్రయజ్ఞవిఘ్నకరమహాసురీమహోగ్ర
           కాయశైలదళననిపుణఘనసురాధిపాయుధాయ