పుట:Ananthuni-chandamu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కిలిప్రాససీసము—

ఉరగతల్పుని గాని యుల్లంబులలో నిల్ప
           శరధితల్పుని గాని సన్నుతింప
మురసంహరుని గాని మ్రొక్కులఁ గయిసేయ
           నరమృగేంద్రులఁ గాని నమ్మికొలువ
గరుడవాహను పేరుఁ గాని వీనులఁ జొన్ప
           బురుషోత్తముని గాని పూజసేయ
హరిప్రసాదముఁ గాని యర్థిమైఁ గొననొల్లఁ
           బరమాత్ముపనిఁ గాని భక్తిఁ బూన


గీ.

ధరణి నివి నాదు నిత్యవర్తనము లనుచుఁ
బరఁగు వ్రతిఁగాని నీవు చేపట్టవనిన
జరుగు నక్కిలిప్రాససీసంబు కృతులఁ
బరభృతాతసిపుష్పాభ పద్మనాభ!

30

వడిసీసము—

కరుణాసముద్రుండు గజరాజవరదుండు
           గర్వితాసురశిరఃఖండనుండు
విహగేంద్రవాహుండు విబుధేంద్రవంద్యుండు
           విశ్వరక్షాచణవీక్షణుండు
రతిరాజజనకుండు రఘువంశతిలకుండు
           రణబలోదగ్రుండు రమ్యగుణుఁడు
గోకులాధీశుండు గోపికారమణుండు
           గోవిందుఁ డురుకళాకోవిదుండు