పుట:Ananthuni-chandamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిటువంటి పదము లింపెసఁగంగ నాల్గింట
           సమధర్మగతి నతిశయము నొండు
నట్టిధర్మమునకు నాస్పదంబై పేర్చి
           యాతతచ్ఛందోవిభాతిఁ దనరి


గీ.

ఆటవెలఁది యొండెఁ దేటగీతియు నొండె
విమలభావ మమర విష్ణుదేవుఁ
డొప్పు ననుచుఁ బొసఁగఁ జెప్పిన సీసంబు
పసిఁడి యగు ధరిత్రిఁ బద్మనాభ!

26

ప్రాససీసము—

భామినిచే నున్న పట్టుతోరముఁ జూచి
           ప్రల్లదంబునఁ ద్రెంచి పాఱవైచి
యామునిద్రోహ మత్యంత మై తనుఁ బట్టి
           యతిదరిద్రునిఁ జేయ నార్తి నొంది
భూమి వెల్వడి పోయి పురపురఁ బొక్కుచుఁ
           బుండరీకాక్ష యోభువనవంద్య
స్వామి నాయపరాధశతసహస్రంబులు
           సైరింపవే కృపాజలధి యనుచు


గీ.

ప్రేముడించు కౌండిన్యునిభీతిఁ బాపి
పృథులసౌఖ్యంబు లొసఁగి గాంభీర్యమమరఁ
బాముపైఁ బవ్వళించిన ప్రభుఁడ వనినఁ
బ్రాససీసంబు విలసిల్లుఁ బద్మనాభ!

27

వృత్తప్రాససీసము—

శ్రీశ్రితవక్షుండు సింధురవరదుండు
           చింతిత ఫలదానశీలుఁ డితఁడు