పుట:Ananthuni-chandamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భాసిల్లుఁ బృథివిమీఁదన్‌
జేసిన నియమములఁ బ్రాససీసాదు లజా!

23


సీ.

వృత్తంబులకుఁబోలె వెలయు నాల్గడుగునఁ
           బ్రాసముల్నిల్పి విరతులు నునుపఁ
బ్రాససీసము లగుఁ బశ్చిమార్ధములట్ల
           భాసిల్ల నక్కిలిప్రాససీస
మగు మున్నుగైకొన్న యతిపాదమందెల్ల
           నడరిన వడిసీస మనఁగఁ బరఁగు
నర్ధమర్ధమునకు యతులు వేఱై చనఁ
           జెప్ప నక్కిలివడి సీసమయ్యె


గీ.

నవకవికి నిట్లు ప్రాసంబు లవతరిల్లు
యతులు ప్రాసంబు లిష్టసంగతుల నడవ
నది యసమసీస ముత్సాహ తుదనుగీతి
పరఁగ విషమసీసం బగుఁ బద్మనాభ!

24


గీ.

అగు సమప్రాససీస మాఱడుగులందు
నాలుగింట వృత్తప్రాసనామసీస
మన్నిచోటులఁ బ్రాసంబు నందెనేని
సర్వతః ప్రాససీసంబు జలజనాభ!

25

అందు సమసీసము—

ఇంద్రులు తమలోన నిద్దఱిద్దఱుఁ గూడి
           యతులకు నాధార మై తనర్చి
మూఁడుచోటుల నుండ మొగి నిద్ద ఱర్కులు
           గదియ నాక్రియ నొక్క పదము మెఱయ