పుట:Ananthuni-chandamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్యాగీతి

క.

కందములకుఁ గలనియమము
లం దేమియుఁ గడమ వడక యడరిన నది యిం
పొందఁగ నార్యాగీతి య
నం దగు ని ట్లురగభూషణప్రణుతగుణా!

14

సమ విషమగీతులు

క.

అమర మఱిగీతులందు వి
షమగీతులు మూఁడు రెండు సమగీతులు నై
సమము లగు నపకలిప్రా
సముల యతుల విషమములఁ బొసఁగు బ్రావళ్లున్‌.

15

విషమగీతులందు ఎత్తుగీతి—

ఆదిప్రాసంబు హరియు
నాదిత్యయుగము నగుచు
నీదెస యతుల నెత్తు
గీదియ నెగడుఁ గృష్ణ.

16

పవడగీతి—

పవడగీతియందుఁ బ్రాసంబు నిలిచి మూఁ
డవగణంబుమీఁద నమరు విరతి
రవులు మువ్వురును బురందరు లిద్దఱు
నవుల నేగు రినులు నర్ధములకు.

17

మేలనగీతి—

నగణమొండె హగణమొండె నగణహగణయుగము
తగిలియుండె సప్తసంఖ్య తత్పదంబు లమరఁ