పుట:Ananthuni-chandamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బపరం బగు[1]చున్నది ముఖ
చపలార్య యనంగఁ జనును జక్కఁగ గృతులన్‌.

9

జఘనచపలార్య

క.

మొదలిసగము చపలార్య
స్పదగణలక్షణము సొరక చరమార్థం బం
దుదితప్రకార రేఖన్‌
గదాధరా చనుఁ గృతుల జఘనచపలార్యన్‌.

10

గీతి

క.

లసదార్య మొదలిసగమున
నెసగఁగ రెండరలుఁ జెప్పిరే నదియే గీ
తి సమాహ్వమ మగుఁ గృతులన్‌
వసుథాధం కృష్ణ యాదవస్వామి యనన్‌.

11

ఉపగీతి

క.

ధర నార్యమీఁదిసగమున
నిరుసగమున నట్ల చెప్పి రేని యదియ దాఁ
బరఁగు నుపగీతి యనఁగా
సరసిజదళనేత్ర కృష్ణశార్ఙ్గధర హరీ!

12

ఉద్గీతి

క.

విదితార్యచరమదళమున్‌
మొదలి సగము చేసి యందు మొదలింటిసగం
బది యపరార్థముఁ జేసినఁ
బొదు వగు నుద్గీతి భుజగభుగ్వరగమనా!

13
  1. నే నన్నది