పుట:Ananthuni-chandamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గడపటిపాదమునకు వడి
యడరును ద్విగణయుతలఘువు కవ్వలిచోటన్‌.

4


ఆ.

సరవిఁ బథ్య విపుల చపలార్య ముఖ జఘ
నాఖ్యచపల లనఁగ నార్య లైదు
నొనర గీతి యనఁగ నుపగీతి యుద్గీతి
యార్యపేరిగీతి యనఁగ నాల్గు.

5

పథ్యార్య

క.

బేసులు త్రిగణయుతములై
యాసమపాదములఁ బొరసి యార్య యనఁ గడున్‌
భాసిల్లుఁ బథ్య యనఁగా
వాసవముఖ సకల దివిజ వర్గ ప్రణుతా!

6

విపులార్య

క.

ప్రకట సమపాదముల నిలు
వక శబ్దమునవలఁ జొచ్చి వచ్చె ననం ద
క్కక విపులార్య యగును సే
వకజనమందార ధీర వనజదళాక్షా!

7

చపలార్య

క.

వరుసను ద్వితీయ మంత్యము
స్ఫురణ న్మద్యగజకారములను దగన్‌ రెం
డరయఁగ దనర్చు నేనిన్‌
సరవి నదియ హరి మురారి చపలార్య యగున్‌.

8

ముఖచపలార్య

క.

చపలాగణప్రకారం
బపారకారుణ్యసాగరా ప్రథమార్థం