పుట:Ananthuni-chandamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామాయనమః

ఛందోదర్పణము

తృతీయాశ్వాసము


మదనంతశయన భవ
భీమదహన నిఖిలహరణభీషణవర్షా
సామజభీతి నివారణ
కామజనక శిష్టలోకకామితవరదా.

1

కందములు

క.

నలగగభజసలు కందం
బుల మూఁడును నైదు షష్ఠముల నలజలు బే
సుల జగణరహిత మంత్యగ
మలఘుపదత్రిగణవిరతి యర్థముల హరీ!

2


గీ.

కంద మరయ నార్యాగీతికడగణంబు
నపరషష్ఠంబు గురులఘు లైననార్య
నలఘు లాఱింట గిరిశరస్థలుల నున్న
నగు ద్వితీయ ప్రధానలఘ్వాదియతులు.

3

ఈచెప్పిన యతినియమంబులు సంస్కృతాదుల కయ్యె. మఱియుఁ దెలుఁగున కెట్లనిన—

క.

వడియగు నార్యకు రెండవ
యడుగునఁ ద్రిగణంబుమీఁదఁ నంధ్రకవితకున్‌