పుట:Ananthuni-chandamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రిదో తెలియదు.“ఇంబు” అనే ప్రయోగమునకు ఆ ఆదర్శములోనే (2.98) “ఇంబడరగా భజసనంబులని యనంతుని ఛందఃప్రయోగము” అని కూడా ఉన్నది. ఇది అప్పకవీయములో లయగ్రాహికి లక్ష్యలక్షణపద్యముగా కనిపించుచున్నది; గాని ఛందోదర్పణములో కానరాదు. అయితే అప్పకవి “పదునేడవశతాబ్దమధ్యమునం దుండిన లక్షణవేత్త” అని వీరేశలింగమువంతులుగారు వ్రాసినారు గదా; అప్పకవి పద్యమును ముద్దరాజు రామన ఎ ట్లుదాహరించియుండును? ఇంతకంటెను ఆశ్చర్యమైనదేమంటే, చిత్రకవి అనంతయగారి హరిశ్చంద్రనలోపాఖ్యానప్రకాశికలో ద్వితీయాశ్వాసాంతమున (శ్రీ వఝల చినసీతారామస్వామిశాస్త్రులవారివిమర్శనముతో కలిసి శ్రీవావిళ్లవారిచే ప్రకటితమైన ప్రతి, పుట.128) నర్కుటవృత్తవ్యాఖ్యలో “ఈవృ త్తమునకే కోకిలకాకమను నామాంతరము కలదు. లక్షణము:— కొలిచెద నాదిదేవు....(అప్పకవీయము. ఆ. 4)" అని ఉన్నది. ఈ గ్రంథము మొదట అచ్చొత్తించిన పూండ్ల రామకృష్ణయ్యగారో పూర్వలేఖకులో అప్పకవీయ పద్యములను ఈవ్యాఖ్యానములలో దూర్చి ఉండవలెను. నేను చూచిన తాటాకుపుస్తకములందు ఇవి కానరాలేదు.

పాఠనిర్ణయము

శ్రీవావిళ్ల వేంకటేశ్వరులుగారు తమవద్దనున్న 14 ప్రతులు శోధించి పాఠనిర్ణయము చేసి గ్రంథ మచ్చొత్తించినారు. వారు నావద్దకుపంపినముద్రితగ్రంథమును, నావద్దనున్న శ్రీ పరవస్తువారిప్రతిని, పరిశీలించి ఈ ఉపోద్ఘాతమును టిప్పణిని వ్రాసినాను.