పుట:Ananthuni-chandamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఇది చదివినపిమ్మట మఱి
యెదియేనియుఁ జదువుబుద్ధి యేలా వొడమున్
బదఁపడి గ్రంథములన్నియు
వెదకివెదకి సారమెల్ల వివరింపంగన్."

అని వ్రాసుకొన్నాడు. అయితే నిరంకుశాధికారమును వహించినవానివలె తన ఇష్టానిష్టములఁ బట్టి లక్షణములను అతడు శాసించినాడు. శ్రీవావిళ్లవారు ఇప్పుడు త్వరలో అచ్చొత్తించబోయే అప్పకవీయ పీఠికలో అవి తెలియజేయుట ఉండును; గాని, ఇక్కడ చర్చించుట అనవసరము.

గ్రంథప్రచారము

"క్రీ. శ. 16204వ సంవత్సరప్రాంతములందు కవిగాఁ బ్రసిద్ధికెక్కినవాఁడు” అని వీరేశలింగము పంతులుగారు చెప్పిన చిత్రకవి అనంతయ "హరిశ్చంద్రనలోపాఖ్యాన ప్రకాశిక"లో (V. 8.) “క. ప్రథమాంతవిభ క్తులపై ..." అనే ఛందోదర్పణములోని పద్యమును ఉదాహరించినాడు. ఈ పద్యమునే 16-వశతాబ్దాంతమున ఉండినవాడని వీరేశలింగముపంతులుగారు చెప్పిన ముద్ద రాజు రామన్న “రాఘవపాండవీయాదర్శము"లో(I. 2, iii. 65) రెండుచోట్ల ఉదాహరించినాడు. అంతేకాదు “పోణిమి” అని ణకారముగా చెప్పవచ్చుననుటకు, “తీవ తీఁగ యనుచు. ..”' అనేపద్యము అనంతుని ఛందముందున్నట్లు ముద్దరాజు రామన “రాఘవపాండవీయాదర్శము”లో (11.6) చెప్పినాడు; గాని, ఆపద్యము ఛందోదర్పణములో కనబడదు. ఈ పద్యము ఎవ