పుట:Ananthuni-chandamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రించి ఛందోదర్పణములో ఉన్నన్ని విషయములు కవిజనాశ్రయములో లేవు.

1 “క. పరగగ నిరువదియాఱ.... ” ఛందో. పుట 61; కవి. పు. 52.

2 "క. క్రమమునఁ బ్రస్తారము....” ఛందో. పు. 85; కవి. పు. 76.

3 "సీ. వృత్తంబునకువలె...” ఛందో. పు. 69; కవి. పు. 67.

ఈ మూడుపద్యములు రెండుగ్రంథములందున్ను కనబడుచున్నవి. వీటిలో మొదటివి రెండున్ను ఎవరు చెప్పినవో ఏ గ్రంథములో ఇవి ప్రక్షిప్తము లనవలెనో తెలియదు. మూడవది ఛందోదర్పణములోనిదేగాని కవిజనాశ్రయములోనిది కాదని మరియొకచోట నీపీఠికలోనే తెలియజేసినాను.

అనంతుఁడు 105 సమవృత్తభేదములను 9 విషమవృత్తభేదములను చూపించినాడు. కవిజనాశ్రయములో 123 సమవృత్తభేదములున్ను 6 విషమవృత్తభేదములున్ను ఉన్నవి.

జాత్యుపజాతుల గురించి ఛందోదర్పణములో చెప్పినంత గ్రంథము కవిజనాశ్రయములో లేదు. రగడలు, కళికలు, ఉత్కళికలు వీటినిగుంచి కవిజనాశ్రయకర్త ఏమిన్నీ చెప్పలేదు.

లక్షణగ్రంథములన్నిటిలోను ఛందోవిషయములు ఎక్కువగా వివరించి చెప్పినది అప్పకవీయమే అనుటకు సందేహము లేదు. అందుచేతనే, అప్పకవి,

“క.

ఒక దానికంటే మఱివే
ఱొకటి విశేషంబుఁ జెప్పుచుండుకతమునన్
సకలగ్రంథములను జదు
వక దెలియునె లక్షణప్రపంచంబెల్లన్.