పుట:Ananthuni-chandamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21

వది యుపసర్గలు. వీనిలో పరా, అఙ్, అపి, అన్నవిగాక మిగిలిన పదునేడును బరస్పరసంధి యైనప్పుడు స్వరయతియైనను వ్యంజనయతియైనను బ్రయోగింపఁదగును.

వీని కుదాహరణము:-

ఉ.

ప్రాంతనిరంతరాన్విత దురంతసమస్తపరాక్రమంబున
త్యంతమదాప్తిశోభన మపాయ ముపాయము వీక్షణంబు ప్ర
త్యంత మభీష్టమధ్యయము స్వాంతము నీత ముదంచితంబుప
ర్యంతమనంగ సంధిలుఁ దిరంబుగ రెంటను బ్రాదులచ్యుతా!

94

కాకుస్వరయతి:-

క.

కాకుస్వరయతి యగు నితఁ
డే కదలక జలధిఁ బవ్వళించె ననఁగ బ్ర
శ్నా కలితదీర్ఘ మగు నితఁ
డే కవ్వడి రథముఁ గడపె నిమ్ముల ననఁగన్‌.

95


ఆ.

వలదు కృష్ణ యెఱుఁగవా మున్ను నన్ను నీ
వా విరుద్ధభాష లాడ నేల
లోన నెట్టియలుకలో నాఁగఁ గాకుస్వ
రోక్తి రెంటఁ జెల్లు నొగి ధరిత్రి.

96


గీ.

వరుసదీర్ఘాంతసంబుద్ధి వచనయతుల
కమరుఁ గాకుస్వరంబు పరమసహస్ర
నామశోభిత గోపకృష్ణాయనంగ
నమరవందిత గోపకృష్ణా యనంగ

97

నిత్యసమాసయతి:-

గీ.

పదము విభజించి చెప్పఁ జొప్పడని యవియు
నన్యశబ్దంబుఁగొని విగ్రహంబుఁ జెప్పు