పుట:Ananthuni-chandamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఛందోదర్పణము


గీ.

తెల్లముగ ఋకారము యణాదేశశక్తిఁ
గలుగు రేఫయిత్వమునందుఁ గదిసి యతికి
నట్టిరీకి నీయేలతో నన్వయించు
నట్టిసత్త్వంబులే దది హల్లుగాన.

89


గీ.

మును ఋకార మీ యేలతో నొనరినట్లు
చేర దొకట యణాదేశకారణమున
ఘనలకారంబ యగును ఌకారవిరతి
కౢప్తి లేదు శౌరిగుణావళికి ననంగ.

90


క.

స్వరములు కాదుల నొందిన
నరుదుగ స్వరయతులు దగును బ్రాదులు గాకు
స్వరమును నిత్యసమాసా
క్షరసంధులు రెండు నగు భుజంగమశయనా!

91


గీ.

ప్రాదినిత్య సమాసశబ్దములు గాక
పెరపదంబుల పైనచ్చు బెరసినప్పు
డన్నియును స్వరయతులగు సాంబగురుఁడు
శ్రీశుఁ డమరాన్వయాబ్ధి పూర్ణేందుఁ డనఁగ.

92

ఉపసర్గలు

క.

ధర నుపసర్గలు ప్రాన్వప
దురపాభిప్రతిసువిన్యు దుపపర్యధిసమ్‌
నిరతిపరాజపులిరువది
పరాఙపులు చొరవు తెలుఁగు బాసను నెందున్‌.

93

టీ. ప్ర, అను, అవ, దుర్, అప, అభి, ప్రతి, సు, వి, ని, ఉత్, ఉప, పరి, అధి, సమ్, నిర్, అతి, పరా, అఙ్, అపి, అను నివి యిరు