పుట:Ananthuni-chandamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాణసమానమిత్రుఁ డీకృతికి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్.” ఈ పద్యము లనన్వయముగా నుండుటచేత నందుఁ బేర్కొనఁబడిన భీమునకును గ్రంథమునకును గల సంబంధ మిట్టిదని నిర్ణయింపవలనుగాక యున్నది" అని శ్రీరామయ్యపంతులుగారు గ్రంథమున చేర్చలేదు. “పై పద్యము లనన్వితములుగావు. గ్రంథమునఁ గూర్చుకొని చూచినచోఁ దేటపడఁగలదు. పాఠము తప్పుగా నున్నప్పుడు సమన్వయ మె ట్లేర్పడును?” అని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధరత్నావళి పీఠికలో ఈవిషయము చర్చించి వ్రాసినారు. భీమకవి కవిజనాశ్రయకర్త కానేరడనియే వారితలంపు. వారు చెప్పినట్లు “వేములవాడ భీమకవి విషయము సర్వమును సందిగ్ధమే యగుచున్నది.”

ఛందోదర్పణకాలమును నిర్ణయించగలిగినట్లు కవిజనాశ్రయకాలమును నిర్ణయించలే మనుట స్పష్టము. అనంతుఁడు భీమకవినిగాని కవిజనాశ్రయమునుగాని ఎరిగిఉన్నట్లు కనబడదు.

అనంతుని ఛందోదర్పణమును ఎదుట నుంచుకొని అప్పకవి కొన్నివృత్తములకు లక్ష్యములు వ్రాసినట్లు స్పష్టముగా కనిపించుచున్నది. మదరేఖ, తోదక, మనోజ్ఞ, ప్రియకాంత, నర్కుటము,