పుట:Anandam Manishainavadu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేసిన ప్రశ్నకు తడుముకోకుండా చురకల్లాంటి సమాధానం అవధానులు చెప్పగా, ఆహుతులు హాయి నవ్వుకుంటారు. ఎంతో సమయస్ఫూర్తి, హాస్యచతురత ఉన్నవారే ఈ అంశం నిర్వహించగలరు. ఈ అంశం సమర్ధంగా పృచ్ఛకులు నిర్వహించలేకపోతే మొత్తానికి అవధానం చప్పబడిపోయిందని చప్పరించే ప్రమాదముంది.

స్వతహాగా చమత్కారం, ఏ కొత్త ప్రక్రియని చూసినా ఆకళించుకోగల సాధికారం మా రమణ సొత్తు. పాత్రికేయునిగా పనిచేసినవాడు కావడంతో - సమకాలీన సమస్యలు అవధానంలో అవలీలగా ఉదహరించేవారు. ఒక్కో ప్రశ్న, దానికి అవధాని సమాధానం పది కార్టూన్ల పెట్టుగా ఉండేది. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన విసుర్లు జోరుగా ఉండేవి. ఒకసారి అత్తిలిలో నేటి ప్రముఖ శతావధాని కోట లక్ష్మీనరసింహంగారి అవధానంలో రమణ

చైతన్య కల్చరల్ అసోసియేషన్ సభలో

శ్రీ కె. సైమన్‌పాల్ చేతుల మీదుగా సత్కారం.

చిత్రంలో సంస్థ కార్యదర్శి శ్రీ పి. టి. వెంకటేశ్వర్లు