పుట:Anandam Manishainavadu.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెలాఖరు రోజున స్కూలుకు వచ్చేవారు. నెల మొదటి, రెండు తేదీల్లో బిల్లులు, మంత్లీ రిటర్న్‌లు (ఎం. ఆర్.) తయారు చేసుకుని మళ్లీ మూడో తేదీ నుంచి సెలవుల్లోకి వెళ్ళిపోయేవారు. దీంతో దాదాపు నెలంతా ఏకోపాధ్యాయ పాఠశాల అయిపోయేది.

అయిదు తరగతులకు రమణే బోధించేవారు. ఆ ఊరుకి అన్ని వైపులా పుంతరోడ్లే ఉండేవి. మట్టిరోడ్లు కావడంతో వానవస్తే మోకాలు లోతు కయ్య అత్తిలికి మూడు కిలోమీటర్ల దూరంగా గుమ్మంపాడు లాకులున్నాయి. ఆ లాకుల మీదుగా గ్రామానికి రావాల్సివచ్చేది. పొడిగా ఉన్నప్పుడు సైకిల్‌మీద ఆయన ఎక్కితే... వాన పడగానే సైకిల్ ఆయన నెత్తిపైకి ఎక్కేది. స్కూల్లో ఉంగా వర్షం వస్తే సైకిల్ తలపైన పెట్టుకుని మోకాలు లోతు బురద నీళ్లలో నడిచి వెళ్లేవారు. ఏకోపాధ్యాయుడు కావడంతో ఏ రోజూ సెలవు పెట్టే వీలు లేదు. సెలవు పెడితే పిల్లల చదువు దెబ్బతింటుంది. దాంతో వర్షాకాలంలో వారానికి మూడు రోజులు సైకిల్‌తో సర్కస్ ఫీట్లు. మెడ వాలిపోయెలా మోసి ఇబ్బంది పడడం తప్పేదికాదు.

కొన్నాళ్లకి ఆయన కష్టం చూడలేక గ్రామంలోని యువకులు వంతులవారీగా వాన పడినపుడు సైకిల్ మోసి లాకుల దగ్గర దింపేవారు. కొన్నిసార్లు వాన పడినపుడు లాకుల దగ్గరకు చేరి ఆయన కోసం వేచివుండి తీసుకొచ్చిన సందర్బాలు ఉన్నాయి.

ఈ అభిమానం కొన్నాళ్లు బాగానే ఉన్నా తన కోసం మరొకరు ఇబ్బంది పడడం బాగోలేదని అనుకున్నారు. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తే లాకుల దగ్గర ఉండే కిళ్ళీకొట్టులో సైకిల్‌ పెట్టి స్కూలుకు వెళ్ళడం మొదలు పెట్టారు.

ఇది జరిగిన ఐదేళ్లకు 2 స్కూల్లు ట్రాన్స్‌ఫర్ అయ్యి, దాసుళ్ల కుముదవల్లి అనే పూరి పాఠశాలలో పనిచేస్తుండగా మళ్లీ ఆ యువకులు అందరూ వచ్చారు. వాళ్ళ ఊరి పాఠశాలలో ఆయన చేరి పూర్వ వైభవం తీసుకు రావాలని కోరిక. కాని ఆయన పనిచేస్తున్న డి. కుముదపల్లి వదిలి వెళ్లదలుచుకోక పోవడంతో వాళ్లు బతిమాలి, బతిమాలి వెళ్లిపోయారు.