పుట:Anandam Manishainavadu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"సం"గతులు

నమస్కారంకాదు... మనస్కారం...

ఎవరైనా నమస్కారం ఎలా పెడతారు? రెండు చేతులూ జోడించికానీ, ఒక చెయ్య చిరంజీవిలాపెట్టి సెల్యూట్‌కానీ చేస్తారు కదా. కానీ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు (నాని)గారు సూరంపూడి వెంకటరమణకు మాత్రం ఒక చెయ్యి ముక్కుముందు నిలువుగా పెట్టి తలను అడ్డంగా ఊపుతారు. ఇదేం విచిత్రం అంటే దాని వెనుక ఓ కథ ఉంది.

వెంకటరమణ స్కిట్‌లు (లఘు హాస్య నాటికలు) రూపొందించి ప్రదర్శిస్తూంటారు. ఆయన వేసే స్కీట్లలో విసనకర్ర స్కిట్ బాగా ఫేమస్. తాటాకుల విసనకర్రలు అమ్మే వ్యాపారిగా ఆయన నటించారు. విసనకర్రలండీ.. విసనకర్రలు... అంటూ